2024-09-23 17:56
మొత్తంగా నువ్వు ఇష్టం.!
నాకు
నిన్ను నన్ను కలిపే
సాయంత్రం అంటే ఇష్టం
కుండపోత వర్షం లాగా
బోరున దెబ్బలాడుకున్నాక
సీతాకోక చిలకొచ్చి
పువ్వుపై వాలినట్టుగా
నువ్వు ప్రేమగా నన్నత్తుకోవడం ఇష్టం.
అలక అలకాకోసారి
మురిపెంగ నువ్వు నన్ను
ముద్దాడటం ఇష్టం
పొద్దంతా అలిసి వచ్చానని కాదు గాని
తెల్లవార్లు నా కన్నుల నిండా
నిన్ను మోసే ఈ రాత్రులంటే బలే ఇష్టం.!
✍🏻 #దియా_విఘ్నేష్ 💞