2024-09-13 15:41
ఆడైనా...మగైనా...
ఎమోషనల్ గా కనెక్ట్ అయినవాళ్ళను జీవితాంతం కావాలనుకుంటాం.
పక్కనుంటే చాలు అనుకుంటాం.
చావైనా,బ్రతుకైనా వాళ్ళతోనే అని నిర్ణయించుకుంటాం.
వాళ్ళు ఎలా ఉన్నా అంగీకరిస్తాం.
ఒకవేళ మన జీవితంలో లేకపోయినా ఒక జ్ఞాపకంగా
అయినా గుండెళ్ళో మోస్తాం.
మనకు తెలియకుండానే వారితో అనుబంధం ఏర్పడుతుంది.
ఆ అనుబంధం ఏర్పడడానికి పెద్దగా టైం పట్టదు.
ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు.
దొరికినా కొందరికి కాపాడుకోవడం రాదు.
రంగురాళ్ళు చూసి మురిసిపోయే వారికి మట్టిలో ఉన్న వజ్రం విలువ ఎన్నటికీ తెలియదు కదా.🌹🌹